కోమటిరెడ్డి కోవర్ట్ పాలిటిక్స్.. పార్టీ మారకుండా?

-

రాజకీయాల్లో కోవర్టు ఆపరేషన్స్ కామన్ గానే జరుగుతుంటాయి. అంటే ఒక పార్టీలో పనిచేస్తూ…ఆ పార్టీకి నష్టం కలిగేలా మరో పార్టీకి లాభం చేకూర్చేలా కొందరు నాయకులు పనిచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల రాజకీయ పార్టీలకు చాలా నష్టం జరుగుతుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలాంటి కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ తాజాగా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోవర్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి చాలాకాలంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉండటం లేదు. తనకు నచ్చిన విధంగా రాజకీయం చేస్తూ వెళుతున్నారు. ఇదే క్రమంలో ఆయన….కాంగ్రెస్‌ని వదిలి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది…కానీ అనూహ్యంగా కోమటిరెడ్డి సోదరుడు..రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలబడ్డారు.

మునుగోడులో మళ్ళీ గెలవడానికి కష్టపడుతున్నారు. అయితే రాజగోపాల్ వెళ్ళినా సరే తాను మాత్రం కాంగ్రెస్‌ని వదలనని వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. పైగా రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నారు. అలా అని మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం తిరగడం లేదు. కానీ ఆయన పరోక్షంగా తన సోదరుడుని గెలిపించుకునేందుకు కోవర్టు ఆపరేషన్‌కు తెరలేపారని తెలిసింది.

మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడికి మద్దతుగా నిలవాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఫోన్‌ చేశారని ఊకొండి ఎంపీటీసీ సభ్యురాలి భర్త సైదులుగౌడ్‌ ఆరోపించారు. ఇలా ఇంకా కాంగ్రెస్ నేతలకు వెంకటరెడ్డి ఫోన్ చేస్తున్నారని అన్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గాని..వెంకటరెడ్డి వైఖరిపై రేవంత్ రెడ్డి వర్గం ఓ కన్నేసి ఉంచింది. తన సోదరుడు కోసం వెంకటరెడ్డి ఫోన్లు చేస్తుంది నిజమే అంటున్నారు…కాకపోతే కాంగ్రెస్ వదిలి వెంకటరెడ్డి ఇలాంటి పనులు చేస్తే బెటర్ అని రేవంత్ వర్గం ఫైర్ అవుతుంది. మొత్తానికి వెంకటరెడ్డి వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version