కోటంరెడ్డి తమ్ముడుపై సజ్జల వల..!

-

వైసీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబల్ ఎమ్మెల్యేగా మారిన విషయం తెలిసిందే. సొంత పార్టీ వాళ్ళే తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని చెబుతూ..ఇంకా నమ్మకం లేని చోట ఉండలేనని చెప్పి..వైసీపీకి కోటంరెడ్డి గుడ్ బై చెప్పేశారు. అలాగే చంద్రబాబు ఒప్పుకుంటే టి‌డి‌పిలో చేరతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వైసీపీకి దూరం కావడంతో కోటంరెడ్డి టార్గెట్ గా వేధింపులు మొదలయ్యాయని అంటున్నారు.

ఈ క్రమంలోనే కోటంరెడ్డి అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తన అనుచరులైన తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారని, ఎప్పుడో జరిగిన గొడవకు ఇప్పుడు అరెస్ట్ చేశారని, ఇదంతా కక్షపూరితంగా జరిగిందని, షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే అరెస్టులు జరుగుతున్నాయని కోటంరెడ్డి ఫైర్ అవుతున్నారు.

అసలు అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని, తాను వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానని, 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు కోటంరెడ్డి చెప్పారు.

అదే సమయంలో కోటంరెడ్డి తమ్ముడుని వైసీపీ వైపుకు తీసుకెళ్లడానికి సజ్జల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దీనిపై కూడా కోటంరెడ్డి తీవ్రంగా స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి… తన తమ్ముడిని వైసీపీ వైపు లాగాలని‌ చూస్తున్నారని, కానీ తన తమ్ముడుని లాగడం…సజ్జల  తరం గాని, ఆయన తండ్రి, తాత తరం కూడా కాదని ఫైర్ అయ్యారు. తన అనుచరులు ఎవరూ భయపడరని, సజ్జలకు మానసిక‌ శునకానందం, వికృతానందం మినహా ఏ ప్రయోజనం ఉండదని అన్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version