కృష్ణా జిల్లా లెక్క ఇదే.. మరీ ఇంత టైట్ ఫైటా?

-

ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగురవేసినా.. ఈసారి మాత్రం టీడీపీకి ఓటమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీకి గుండెకాయ ఏదీ అంటే కృష్ణా జిల్లా అని చెప్పుకోవచ్చు. అయితే.. ఎన్నికల ముగిశాక.. ఏ జిల్లాలో ఎలా ఉంది. ఏ జిల్లా ఎవరికి అనుకూలంగా ఉందని అంచనాలు వేస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే.. మిగితా జిల్లాల కంటే కృష్ణా జిల్లాలో కాస్త టఫ్ గానే ఉందట సిచ్యుయేషన్.

మూడు నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్యే కాదు.. జనసేన మధ్య కూడా పోటీ ఉందట. అంటే ట్రయాంగిల్ ఫైట్ అన్నమాట. కృష్ణా జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు జనసేనవే అంటూ వాళ్లు లెక్కలు కూడా వేసుకుంటున్నారట. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగురవేసినా.. ఈసారి మాత్రం టీడీపీకి ఓటమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మరోవైపు కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాకు సమీపంలో ఉన్ రాజధానిని కానీ.. ఈ జిల్లాలో ఉన్న సమస్యలపై కానీ.. అధికార పార్టీ పట్టించుకోలేదని.. అందుకే.. ఈసారి కృష్ణా జిల్లా ప్రజలు వైసీపీకే పట్టం కట్టబోతున్నారంటూ వైసీపీ అంచనాలు వేస్తోంది.

కానీ.. టీడీపీ అంచనాలు మరో విధంగా ఉన్నాయి. టీడీపీ నేతలు కృష్ణా జిల్లా మీదే ఆశలు పెట్టుకున్నారు. 16 సీట్లలో మాక్సిమమ్ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లాలో టఫ్ ఫైటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా టీడీపీ, వైసీపీ అభ్యర్థులపైనేనని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version