13 ఏళ్ల కష్టం.. చంద్రబాబు రాత మార్చేశాడు..!

-

ఓ నటుడికి అవార్డుల కన్నా ఎక్కువ గుర్తింపు చాలా అవసరం. అలాంటి గుర్తింపు రావడం కోసం నటీనటులు చాలా కష్టపడతారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి రాణించడం వేరు కాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించాలంటే చాలా కష్టం.


అలా వేలమంది ప్రయత్నిస్తే ఒక్కరిద్దరికి ఆ ఛాన్స్ వస్తుంది. అలానే ఇప్పుడు వచ్చిన ఈ గుర్తింపు కోసం 13 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నా అని అన్నారు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో చంద్రబాబు పాత్రగా చేసిన శ్రీతేజ్.ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన శ్రీ తేజ్ వర్మ తీసిన వంగవీటి సినిమాలో కూడా నటించాడి. నటుడిగా మారకముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన శ్రీ తేజ్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ 13 ఏళ్లుగా సినిమా అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డానని.



తన స్నేహితులు ఎంచక్కా జాబ్స్ చేస్తుంటే తాను మాత్రం సినిమా పిచ్చితో ఇలా వచ్చేశానని. సినిమాలకు అసిస్టెంట్ గా చేయడంతో పాటుగా వంగవీటితో పాటుగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో నటుడిగా సంతృప్తి చెందానని అన్నాడు శ్రీ తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version