కేటీఆర్ కవరింగ్..మైనస్ కూడా ప్లస్సేనా!

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే…ఇప్పటికే ఈ అంశంపై టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఇప్పటివరకు ముందస్తుపై మాట్లాడని కేటీఆర్…తాజాగా ముందస్తు ఎన్నికలపై బాంబు పేల్చారు..ఓ వైపు కేసీఆర్ ఏమో…ఎన్నికల తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు..ఈ సవాల్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు స్పందించిన ముందస్తుకు రెడీ అని, కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని ప్రతి సవాల్ విసిరాయి.

కానీ ఇంకా ముందస్తుపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. అలాగే సర్వేలపై కూడా స్పందిస్తూ..వరుసపెట్టి బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు బయటకొచ్చాయని, వాటిల్లో గెలుపు తమదే అని ఉందని అన్నారు.

అలాగే తమకున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 90 సీట్లు గెలుస్తుందని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఇక ఇదంతా బాగానే ఉంది గాని… తమ పార్టీలో ఉన్న విభేదాలు తమ  బలానికి నిదర్శనమని, ఎవరిని బలప్రయోగం చేయలేదని కేటీఆర్ కొన్ని డైలాగులు వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి.

ఒకచోట అని కాదు…దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. అయితే ఇలా అంతర్గత పోరు తమ బలం అని కేటీఆర్ చెబుతున్నారు. రాజకీయాల్లో ఎప్పటికైనా అంతర్గత పోరు పార్టీలని బలహీనం చేస్తుంది తప్ప…బలపడేలా చేయదు. ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్తితి కూడా అంతే. ఈ అంతర్గత పోరు వల్ల నియోజకవర్గాల్లో గ్రూపులు పెరుగుతాయి..ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు.. అప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అలాగే నేతలు పార్టీలు మారిపోవచ్చు..అలా జరిగిన పార్టీకి డ్యామేజ్ తప్పదు. ఎటు తప్పిన అంతర్గత విభేదాల వల్ల మైనస్సే తప్ప…ప్లస్ ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version