ఆ మృగం చ‌నిపోయింది : మంత్రి కేటీఆర్ ట్వీట్

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది.  అయితే చిన్నారి చైత్ర హత్య, అత్యాచారం కేసు లో నిందితుడు రాజు మృతిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు మృతదేహం లభ్యం అయినట్లు డీజీపీ మహేందర్రెడ్డి చెప్పాడని కేటీఆర్ ట్వీట్ లో స్పష్టం చేశారు. ఎట్టకేలకు మానవ మృగం మరణించాడని పేర్కొన్నారు.

చైత్ర కు న్యాయం జరిగిందంటూ # JusticeForChaithra యాష్ టాగ్ ను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటన జరిగిన మరుసటి రోజు… నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తప్పుడు సమాచారం కారణంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.