తెలంగాణ ప్రభుత్వం అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో బస్తీదవాఖానాల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రులు కేటీఆర్,లక్ష్మారెడ్డి తెలిపారు. పట్టణాల్లో వస్తోన్న రెస్పాన్స్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్తీదవాఖానాలను విస్తరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై వైద్య ఆరోగ్య, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి మంగళవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో వేసవి నాటికి 500 బస్తీ దవాఖానాలను ప్రారంభించే దిశగా ప్రభుత్వం సన్నహాలు ప్రారంభించింది. జిల్లా కేంద్రాల్లో వైద్యపరీక్షల నిమిత్తం ఉచిత సేవలను ప్రారంభిచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, జీహచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్థన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.