వేడెక్కుతున్న క‌ర్నూలు రాజ‌కీయాలు.. ఆ ఎమ్మెల్యేపై జంట హ‌త్య‌ల ఆరోప‌ణ‌లు!

ఏపీలో సంచ‌ల‌న సృష్టించిన టీడీపీ నేత‌ల జంట హ‌త్య‌ల చుట్టూ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఈ హ‌త్య‌ల‌పై టీడీపీ భ‌గ్గుమంటోంది. మామూలుగానే రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఈ హ‌త్యారాజ‌కీయాలు చాలా కామ‌న్‌. ఇక ఇప్పుడు జ‌రుగుతున్న హ‌త్యలు అయితే అగ్గిని రాజేస్తున్నాయి. అయితే పాణ్యంలో జ‌రిగిన ఈ హ‌త్య‌ల‌పై నారా లోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

హ‌త్య‌కు గురైన టీడీపీ నాయ‌కులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డికి నివాళి అర్పించేందుకు నారా లోకేష్ ఈరోజు పాణ్యం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఈ హ‌త్యల వెన‌క హ‌స్తం ఉంద‌ని ఇప్ప‌టికే వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు లోకేష్ వ్యాఖ్య‌లు ఆజ్యం పోశాయి.

జ‌గ‌న్‌కు ధైర్యం ఉంటే సీబీఐతో ఎంక్వ‌యిరీ వేయించాల‌న్నారు. స్థానికంగా ఉన్న ఓ కుక్క బాగా మొరుగుతోంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు నారా లోకేష్‌. అయితే ఈ కామెంట్ల‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఫైర్ అవుతున్నారు. నిజాలు తెలియ‌కుండా మాట్లాడుతున్నారంటూ భ‌గ్గుమంటున్నారు. కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు. కానీ దీనిపై కాట‌సాని మాత్రం ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.