క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్.. WTC ఫైనల్ తొలి రోజు ఆట రద్దు

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. సౌతాంప్టన్ వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట రద్దు అయింది. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు అయింది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురవడంతో తొలి రోజు ఆట సగం రోజు వరకు కూడా సాగలేదు. మొదట తొలి సెషన్ వరకు వేచి చూడగా భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి.

ఈ క్రమంలోనే … వానదేవుడు కాస్త కనికరించినా.. స్టేడియం మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. దీంతో తొలి రోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రేపటి నుంచి సజావుగా సాగితే తొలి రోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్ డే రోజు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా కాగా 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు రెడీ అయ్యాయి.