హైడ్రా సంచలన నిర్ణయం.. వారిపై క్రిమినల్ కేసులు

-

హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, కుంటలు, నాళాలు, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) కి ప్రభుత్వం నుండి ఫ్రీ హ్యాండ్ ఉండడంతో మరింత స్పీడ్ పెంచింది. ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంతోపాటు ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలోగ్గకుండా.. తన, మన అనే భేదం లేకుండా ఆక్రమణ అని తేలితే చాలు యాక్షన్ లోకి దిగి పని పూర్తి చేస్తోంది.

అయితే కూల్చివేతల సమయంలో కొన్నిచోట్ల హైడ్రా కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత అధికారులు అనుమతి ఇస్తేనే తాము నిర్మించుకున్నామని.. ఇందులో మా తప్పు ఏముందని వారు హైడ్రా అధికారులను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బఫర్ జోన్, ఎఫ్టిఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

గండిపేట్, మాదాపూర్ ప్రాంతాలలో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన ఐదుగురు ఉన్నత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇప్పటివరకు అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఇకపై వాటికి పరిమిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధం కావడంతో సంబంధిత శాఖ అధికారులలో గుబులు మొదలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version