టిక్కెట్ కోసం బిజెపిలో చేరితే.. షాక్ ఇస్తున్న లోకల్ లీడర్స్..

-

నిన్న మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత.. ఎంపీ టికెట్ కోసం భారతీయ జనతా పార్టీలో చేరారు.. అనుకున్నట్టుగానే అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఖరారు చేసింది.. ఇక ప్రచారం చేసుకుందాం అనుకున్న సమయంలో బిజెపి నేతలు ఆయనకు సహకరించడం లేదట. పార్టీ కోసం కష్టపడిన తమకు కాదని.. వలస నేతకు టికెట్ ఇవ్వడం పై ఆ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది..

జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బిజెపిలో చేరారు. ఆయన్ని బిజెపి అధిష్టానం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ప్రచారానికి సిద్ధం చేసుకున్న సమయంలో ఆయనకు బిజెపి పాతతరం నేతలు షాక్ ఇచ్చారట. బిజెపి లీడర్ ఎవరు బీబీ పాటిల్ కి సహకరించడం లేదని.. దీంతో టిక్కెట్ వచ్చిన ఆనందం ఎక్కువసేపు కూడా నిలవలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.. బీబీ పాటిల్ రెండుసార్లు టిఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా గెలిచారు.

మరోసారి కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ.. బిజెపి నేతలు ఆయనకు గాళం వేసి మరి ఆ పార్టీలోకి చేర్చుకున్నారు. బిఆర్ఎస్ కి రాజీనామా చేయడం.. బిజెపిలో టిక్కెట్ రావడం అంతా చకచకా జరిగిపోయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉన్న బిజెపి నేతలు మాత్రం బీబీ పాటిల్ నీ పట్టించుకోవడంలేదని బిజెపి నేతలే ప్రచారం చేస్తున్నారు..

ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం తాము కష్టపడితే నిన్నకాక మొన్న పార్టీలో కూర్చున్న బీబీ పాటిల్ కి అధిష్టానం టిక్కెట్ ఇవ్వడంపై కొందరు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీలో ప్రచారం నడుస్తుంది. టిక్కెట్ వచ్చాక తొలిసారి జహీరాబాద్ కి వచ్చిన బీబీ పాటిల్ కి స్వాగతం పలకడానికి సీనియర్ నేతలు ఎవరూ వెళ్లలేదట. దీంతో పాటిల్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారనీ ఆయన అనుచరుల మాట. పాటిల్ నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్య నేతలతో పాటు వారి అనుచరులు కూడా దూరంగా ఉంటున్నారట.. దీనిపై బిజెపి అధిష్టానానికి పాటిల్ ఫిర్యాదు చేశారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version