ఇటీవల ఆర్మూర్ లో నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ విషయం పై ఎంపీ అరవింద్ కు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్ల ఫోన్ చేశారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ దాడి లో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును కూడా స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఎంపీ అరవింద్ ను ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. కాగ తన పై దాడి రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలోనే జరిగిందని స్పీకర్ ఓం బిర్లా కు ఎంపీ అరవింద్ తెలిపారు.
అలాగే ఈ దాడికి రాష్ట్ర పోలీసులు పూర్తి సహకారం అందించారని తెలిపారు. అంతే కాకుండా తనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు హత్య ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాగ ఈ వ్యవహారం పై మరింత చర్చించడానికి ఎంపీ అరవింద్ ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్ల ఢిల్లీకి రావాలని సూచించారని తెలుస్తుంది. దీంతో త్వరలోనే నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. అక్కడ లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల కు రాష్ట్ర ప్రభుత్వంపై పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు.