వ‌ప‌న్ క‌నిపెట్టిన ప‌దాన్ని ఇప్పుడు లోకేష్ బాగానే వాడేస్తున్నారుగా..

జనసేనాని పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి అందరికీ విదితమే. అయితే, ఘోరపరాభవం చవి చూసినప్పటికీ తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు పవన్. ఈ క్రమంలోనే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆయన్ను ‘జగన్ రెడ్డీ’ అని పిలిచేవాడు. అయితే, ఆ తర్వాత కాలంలో పవన్ రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేరు. వరుస సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయి రాజకీయం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.

అయితే, పవన్ జగన్‌ను ‘జగన్ రెడ్డీ’ అని దీర్ఘాలు తీసి పలకడం ద్వారా అతడిని ఓ వర్గానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందేమోనని, అది రాజకీయ అస్త్రంలో భాగమేమోననే చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. అయితే, తర్వాత కాలంలో ఆ పేరు పవన్ నోటి నుంచి రాలేదు. అయితే, పవన్ ఈ పేరుని ఉపయోగించుకోవడంలో తడబడినప్పటికీ టీడీపీ మాత్రం అంది పుచ్చుకున్నదని చెప్పొచ్చు. తాము ఆ వర్డ్‌ను కనిపెట్టకపోయినా వాడేసుకుంటూనే ఉంది.

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు నాయుడు జూమ్ మీటింగ్స్‌లో ఏం జగన్ రెడ్డీ అంటూ నిలదీస్తుండటం మనం చూడొచ్చు. ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆ పదాన్ని ప్రతీ రోజు వాడుతుంటారు. కనీసంగా రోజుకు ఐదు సార్లు అయినా ‘జగన్ రెడ్డీ’ అంటూ ట్వీట్స్ చేస్తుంటారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ‘జగన్ రెడ్డీ’ అంటూ ట్వీట్స్ చేస్తున్నప్పటికీ అటు వైపు నుంచి స్పందన అయితే లేదు. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌కు కౌంటర్ అటాక్ చేయడంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందుంటారు. లోకేశ్‌కు ‘మాలోకం’ అని పేరు పెట్టి మరి విమర్శలు చేస్తుంటారు.