దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే.. జితేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడానికి అదొక్కటే కారణమా లేక ఇంకేమన్నా ఉందా? అనే విషయాలు మాత్రం తెలియట్లేదు.
లోక్ సభ ఎన్నికలు పూర్తికాకముందే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి షాకిచ్చారు. ఆయనకు ఈసారి ఎంపీ టికెట్ దక్కలేదు. ఈనేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారట.
2014లో టీఆర్ఎస్ తరుపున మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి జితేందర్ రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేతగా ఉన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ సమస్యలపై ఎన్నో సార్లు ఆయన గళమెత్తారు. విభజన చట్టంలోని హామీలపై ఆయన ఎన్నోసార్లు కేంద్రాన్ని నిలదీశారు.
అయితే.. ఆయనకు ఈసారి కూడా టికెట్ కన్ఫమ్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఆయన సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని ఆయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కు కోపం తెప్పించాయట. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే.. జితేందర్ రెడ్డికి టికెట్ రాకపోవడానికి అదొక్కటే కారణమా లేక ఇంకేమన్నా ఉందా? అనే విషయాలు మాత్రం తెలియట్లేదు.
సో.. అప్పటి నుంచి జితేందర్ రెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. తనకు తెలిసిన కేంద్రమంత్రులకు మాత్రం టచ్ లోకి వెళ్లారట. దీంతో రాంమాధవ్ రంగంలోకి దిగి జితేందర్ రెడ్డితో చర్చలు జరిపారట. చర్చలు సఫలం కూడా అయ్యాయట. జితేందర్ రెడ్డికి రాజ్యసభ మెంబర్ షిప్ ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందట. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్ నగర్ కు రానున్నారు. ఆ సమయంలోనే జితేందర్ రెడ్డి.. ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.