యూపీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ .. ఎస్పీకి మ‌ద్ద‌తు

-

వ‌చ్చే నెల నుంచి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, ఎస్పీ పార్టీలు విజ‌య దీమా తో ఆన్ లైన్ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఇరు పార్టీల నుంచి జంపింగ్ లు కూడా జోరుగానే న‌డుస్తున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెనర్జీ కూడా అడుగు పెడుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ని ఓడించ‌డానికి త‌ను కావాల్సిన సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించింది.

అందు కోసం అఖిలేష్ యాద‌వ్ కు చెందిన స‌మాజ్ వాద్ పార్టీకి పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ప్ర‌చారం లో కూడా పాల్గొంటున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. అందులో భాగంగా ల‌క్నో, వార‌ణాసి ల‌లో జ‌రిగే ఆన్ లైన్ ప్రచారంలో మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన‌నున్నారు. బీజేపీ ని ఓడించ‌డానికి అన్ని శ‌క్తులు క‌లిసి ముందుకు రావాల‌ని మ‌మత అన్నారు. అయితే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వ్య‌క్తులు త‌మ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత ఉత్స‌హం వ‌చ్చింద‌ని ఎస్పీ నాయ‌కులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version