తారక రాముడి స్మరణ ఆజన్మాంతం తెలుగు నేల రుణపడి పోయిన తీరు ఇవాళ మరోమారు
అదేవిధంగా అదే కృష్ణా తీరాన మరో బిడ్డ ఆయన ఏఎన్నార్ తనదైన జీవితాన్ని కడదాకా సాగించిన మరో స్రష్ట.. గొప్ప వ్యక్తి ఆయన. ఈ ఇద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్లు వారి చూపు అర్థవంతం జీవితం అర్థవంతం ఇవాళ నాగ్ ఆ ఇద్దరినీ స్మరిస్తూ ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని అంటున్నారు పావన గోదావరి తీరాల చెంత కృష్ణమ్మ బిడ్డల స్మరణ… ఓ వరం భాగ్యం కూడా!
ఇవాళ బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ ను రాజమండ్రి లో మార్గానీ ఎస్టేట్స్ లో వైభవోపేతంగా నిర్వహించారు. ఆ విశేషాలతో పాటు ఇంకొన్ని మనలోకం పాఠకులకు ప్రత్యేకం.సుందర గోదావరి తీరాల చెంత నాన్నను స్మరిస్తూ నాగార్జున అభిమానులను అలరించారు.అక్కినేనిని స్మరిస్తూ నాన్న ఎక్కడికీ వెళ్లలేదు ఇక్కడే ఉన్నారు అని మరోమారు నాన్నకు నమస్సులు చెల్లించారు.
తనకు సినిమా ప్రేమ నమ్మకం కన్నా తన అభిమానులంటేనే ప్రేమ, నమ్మకం ఎక్కువ అని, కలెక్షన్లు కావని ఇవే ముఖ్యమని చెప్పారు.ఇవాళ నందమూరి తారకరామారావు వర్ధంతి..అంటూనే ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఓ కొత్త స్లోగన్ వినిపించారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని మరో మారు చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకూ ఆ ఇద్దరూ అజరామరం..వారికి మరణం లేదు జననం తప్ప! అన్న అర్థంలో భావోద్వేగభరితంగా మాట్లాడారు నాగ్. వేడుకలకు విచ్చేసిన కురసాల కన్నబాబు,దర్శకులు కురసాల కల్యాణ్ కృష్ణ, నాగచైతన్య, కృతిశెట్టి జంట వీరితో పాటు యువ ఎంపీ మార్గాని భరత్ ఇలా అంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.