ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో తెలంగాణ-ఛత్తీస్ ఘఢ్ సరిహద్దు ప్రాంతమైన కర్రీగుట్ట వద్ద మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో స్థానిక పోలీసులు హై అలర్ట్ అయ్యారు. మావోయిస్టులు ఇక్కడి ప్రాంతానికి వచ్చే అవకాశముందని పల్లెలన్నీ జల్లెడ పడుతున్నారు.