బస్ లో కేబినేట్ మీటింగ్ కి వెళ్ళిన మంత్రి, అసలు ఎం జరిగిందంటే…!

-

సాధారణంగా మంత్రులు అంటే మనకు ఏమి అభిప్రాయం ఉంటుంది చెప్పండి…? రాజభోగాలు అనుభవిస్తారు, విలాసవంతమైన జీవితం, వాళ్ళు ఏది అంటే అది కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎక్కడికి అయినా వెళ్ళాలి అంటే వాళ్ళకు విలాసవంతమైన కార్లతో పాటు క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్ చేసి పంపిస్తూ ఉంటారు అధికారులు. కాని ఒక మంత్రి గారు మాత్రం బస్ లో కేబినేట్ మీటింగ్ కి వెళ్ళడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

అదేంటి అంటారా…? అయితే ఇది చదవండి మీకే అర్ధమవుతుంది. పుదుచ్ఛేరికి వ్యవసాయ శాఖ మంత్రి ఆర్.కమలకన్నన్ శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశానికి వెళ్ళాల్సి ఉంది. అయితే ఆయనకు ప్రభుత్వం కేటాయించిన కారులో వెళ్ళడానికి పెట్రోల్ అయిపోయింది. డ్రైవర్ ఎంతో కష్టపడి కారును కోపరేటివ్ పెట్రోల్ స్టేషన్ వరకు తీసుకు వెళ్ళినా బ౦క్ సిబ్బంది మాత్రం ఆయనకు పెట్రోల్ కొట్టలేదు.

దీనితో మంత్రి గారు చేసేది లేక బస్ లో కేబినేట్ మీటింగ్ కి వెళ్ళారు. ఇంతకు మంత్రి కారుకి పెట్రోల్ ఎందుకు కొట్టలేదు అంటారా…? ఆ పెట్రోల్ బంకు నిర్వహిస్తు౦ది ప్రభుత్వమే. దీనిని అదునుగా చేసుకుని ప్రభుత్వాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బంకుకు వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారే గానీ డబ్బులు ఇవ్వడం లేదు. గత అయిదేళ్ళు గా బకాయిలు చెల్లించకపోవడంతో ఆయనకు పెట్రోల్ కొట్టలేదు అధికారులు. అందుకే మంత్రి గారికి బస్ ప్రయాణం తప్పలేదు మరి.

Read more RELATED
Recommended to you

Latest news