శ్రీకాకుళం జిల్లాలో మ‌రో రోడ్డు ప్ర‌మాదం.. మంటల్లో దగ్ధమైన..

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పరిశాం వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగివున్న లారీని.. ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ టూరిస్ట్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తింపు. పూరి నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంసమయంలో దట్టమైన పొగలు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఘటన స్ధలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో దాదాపు గంటకుపైగా ట్రాపిక్‌ నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.