తమిళనాడు లో ఇటీవల మంత్రిగా ఉన్న బాలాజీ ఇంటి పై ఈడి దాడులు చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడన్న కారణంగా మంత్రిని అరెస్ట్ చేశారు.. ఇది జరిగిన కొంత కాలానికి ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మరియు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇంటిపై ఈడి అధికారులు దాడి చేయాలని ప్లాన్ లో ఉన్నారని స్వయంగా ఉదయనిధి స్టాలిన్ బయటపెట్టాడు. ఈయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు మా ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేస్తారని చెబుతున్నారని అన్నారు, మా ఇంట్లో సోదాలు చేసే దమ్ము ఈడి కి ఉందా అంటూ ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించాడు ? ఎవ్వరైనా ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి సోదాలు చేసుకోవచ్చు అంటూ చెప్పాడు.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపించి అన్నా డిఎంకె ను బీజేపీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంది, కానీ డీఎంకే అలా కాదు ఎప్పటికీ బానిసగా మారదన్నారు. ఈడి కానీ లేదా బీజేపీకి భయపడే ప్రసక్తే లేదన్నారు ఉదయనిధి స్టాలిన్ గట్టిగా మాట్లాడారు.