టాలీవుడ్ అగ్ర కథ నాయకుడు మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రస్తుతం తాను సినిమాలు, యూనివర్సిటీ పనుల్లో బిజీగా ఉన్నానని అన్నారు. అందు వల్ల రాజకీయాలకు సమయం కేటాయించడం లేదని అన్నారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. కాగ మోహన్ బాబు 2019 జనరల్ ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీ లో జగన్ సమక్షంలో చేరారు.
అయితే ఇటీవల సినిమా టికెట్ ధరల విషయంలో టాలీవుడ్ కు, జగన్ ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. అప్పుడు మోహన్ బాబు.. అధికార పార్టీ అయిన సైలెంట్ గా ఉన్నారనే వాదనలు వినిపించాయి. అలాగే ఇటీవల మంత్రి పేర్ని నాని మోహన్ బాబు ఇంటికి వస్తే.. కూడా వివాదం చోటు చేసుకుంది. దీనిపై కూడా తాజా గా మోహన్ బాబు స్పందించాడు. పేర్ని నాని తాను స్నేహితులం అని.. అందుకే పేర్ని నాని తనను కలవడానికి ఇంటికి వచ్చాడని అన్నారు. అందులో తప్పు లేదని అన్నారు.
కాగ మోహన్ బాబును వైసీపీ దూరం పెడుతున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు కన్నా.. చిరంజీవికి వైసీపీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మోహన్ బాబు మనస్పార్థాలకు గురి అయి రాజకీయాల నుంచి తప్పు కుంటున్నాడని అనుకుంటున్నారు.