ప్రభుత్వం వర్సెస్ హీరోయిన్…!

-

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై మహారాష్ట్ర అధికార పార్టీ నేత సంజయ్ రౌత్, హోం మంత్రి అనీల్ దేశ ముఖ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్రను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఆమెకు మద్దతు ఇస్తుంది… ఏ రాజకీయ పార్టీనో లేదా అధికారంలో ఉన్న కేంద్రం అయి ఉండాలన్నారు. అందుకే ఆమె ఇలా మాట్లాడుతుందని అన్నారు. ముంబై పోలీసులకు హాని కలిగించే కుట్ర జరుగుతోందని అన్నారు.

ముంబై పోలీసులను స్కాట్లాండ్ యార్డ్‌ తో ఆమె పోల్చారని హోం మంత్రి అన్నారు. కొంత మంది ముంబై పోలీసులను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఒక ఐపిఎస్ అధికారి కోర్టుకు వెళ్లారని పేర్కొన్నారు. ఆమెకు మహారాష్ట్ర లేదా ముంబైలో నివసించే హక్కు లేదని రాష్ట్ర మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేసారు. కొన్ని రోజులుగా కంగనా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news