తెలంగాణలో బీజేపీ చాలా దూకుడుగా రాజకీయం చేస్తుంది..నెక్స్ట్ ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతుంది…ఇదే క్రమంలో నియోజకవర్గాల వారీగా బలపడే దిశగా పనిచేస్తుంది…అలాగే టీఆర్ఎస్ లో ఉన్న బలమైన నేతలకు చెక్ పెట్టాలని చెప్పి బీజేపీ కసితో పనిచేస్తుంది..ఇదే క్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చెక్ పెట్టాలని బీజేపీ చూస్తుంది. మల్కాజిగిరిలో మైనంపల్లి ఏ విధంగా బీజేపీ శ్రేణులని టార్గెట్ చేసి దెబ్బతీస్తున్నారో తెలిసిందే.
అయితే తెలంగాణలో బలమైన నేతల్లో మైనంపల్లి ఒకరు. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లి…2014లో టీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు…ఇక 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 73 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పైగా టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మైనంపల్లి దూకుడుగా ముందుకెళుతున్నారు. అదే సమయంలో బీజేపీ నేత రామచంద్రరావు సైతం యాక్టివ్ గా పనిచేస్తున్నారు.
నెక్స్ట్ ఎన్నికల్లో మైనంపల్లికి చెక్ పెట్టాలని చూస్తున్నారు..అయితే ఈ మధ్య వస్తున్న సర్వేల్లో మల్కాజిగిరిలో బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఆత్మసాక్షి సర్వేలో…మల్కాజిగిరిని బీజేపీ కైవసం చేసుకుంటుందని తేలింది. మొత్తానికైతే మైనంపల్లికి బీజేపీనే చెక్ పెట్టేలా ఉంది