లోకేష్‌ను టెన్ష‌న్ పెడుతోన్న ఆ ఇద్ద‌రు టీడీపీ లీడ‌ర్లు…!

-

ప్ర‌స్తుతం తెలుగుదేశం ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత ఘోర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో యువ‌నేత‌లు క‌రువ‌య్యారు. వైసీపీ స‌మ‌ర్థ‌వంత‌మైన యువ నాయ‌క‌త్వంతో దూసుకుపోతుంటే ఆ పార్టీకి యువ‌నేత‌ల ప‌రంగా పోటీ ఇవ్వ‌లేక టీడీపీ చ‌తికిల‌ప‌డుతోంది. ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు సమర్ధవంతమైన నేత చాలా అవసరం.

ఇంకా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న నేత‌ల‌తోనే బండి నెట్టుకు రావాల‌ని చంద్ర‌బాబు చూస్తుండడంతో మిగిలిన యువ‌నేత‌ల్లో తీవ్ర అస‌హ‌నం పెరిగిపోతోంది. ఇక లోకేష్ నాయ‌క‌త్వంలో పార్టీ ముందుకు వెళుతుంద‌న్న న‌మ్మ‌కాలు కూడా ఎవ్వ‌రికి లేవు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఎక్కువుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

లోకేష్‌కు పార్టీని న‌డిపే స‌త్తా లేద‌ని.. అందుకు యువ‌కుడు, మంచి వాగ్దాటి ఉన్న రామ్మోహ‌న్‌నాయుడు అయితేనే క‌రెక్ట్ అన్న టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అయితే రామ్మోహ‌న్ నాయుడు పేరు ఎక్కువుగా చ‌ర్చ‌ల్లోకి వ‌స్తుండ‌డంతో లోకేష్ బాగా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే చంద్ర‌బాబు వ‌ద్ద ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా త‌న రాజ‌కీయ గురువ‌గా ఉన్న క‌ళా వెంక‌ట్రావును కొన‌సాగించాల‌ని ప‌ట్టు బ‌డుతున్నార‌ట‌.

ఇక గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సైతం అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ పార్ల‌మెంటులో కూడా ఓ వెలుగు వెలిగారు. ఈ క్ర‌మంలోనే గల్లా జయదేవ్ కి పార్టీలో ఇమేజ్ పెరుగుతుంది. ఇంత వ్య‌తిరేక‌త‌లోనూ జ‌య‌దేవ్ గెలిచాడు. అందుకే జ‌య‌దేవ్ ప్రాధాన్య‌త సైతం త‌గ్గించేందుకు లోకేష్ అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాడ‌ట‌. ఇక ఈ ఇద్ద‌రు యంగ్ ఎంపీల‌తో లోకేష్ ప‌డుతోన్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావ‌ని పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version