లోకేశం సారూ.. మీకిది త‌గునా..? ఏది ప‌డితే అది మాట్లాడితే చెల్లుతుందా..?

-

లోకేశం గారూ.. ”ఏపీ ప్ర‌జ‌ల డేటా పోయింద‌ని, తెరాస స‌ర్కారే కొట్టేసిందని.. అస‌లు హైద‌రాబాద్‌లో కేసు ఎలా పెడ‌తారు..” అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ట్వీట్లు చేస్తున్నారు క‌దా.. కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాం చెప్పండి..

అయ్యా లోకేశ్‌ బాబు గారూ.. మీరు ఏపీ ఐటీ శాఖ మంత్రి.. క‌రెక్టే.. ఒప్పుకుంటాం. మీరు ఆ పద‌విలో ఉన్నందుకు ఏపీ ప్ర‌జ‌లంతా సిగ్గుప‌డుతున్నారు. ఎందుకో మీకూ తెలుసు. మీకు అస‌లు మాట్లాడ‌మే సరిగ్గా రాదు. అలాంటి మిమ్మ‌ల్ని మంత్రిగా చేసి బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్దారు. అస‌లు కొన్ని సార్లు మీరు మంత్రి అనే విష‌య‌మే మ‌రిచిపోతారు. ప్ర‌జ‌లు ఆ విష‌యం గుర్తు చేయాల్సి వ‌స్తుంది. ఖ‌ర్మ రా బాబు. మీరు ఒక మంత్రి స్థాయిలో ఉండి కేవ‌లం ట్విట్ట‌ర్‌కే పరిమితమై పోతే ఎలా..? మీకు ప్ర‌జ‌లతో నేరుగా మాట్లాడే ధైర్యం లేదా ? లేదా మాట్లాడ‌డం చేత‌కాదా ? స‌రేలే.. మేం రెండోదే ఖాయం చేసుకుంటాంలే..!

అవునూ.. లోకేశం గారూ.. ”ఏపీ ప్ర‌జ‌ల డేటా పోయింద‌ని, తెరాస స‌ర్కారే కొట్టేసిందని.. అస‌లు హైద‌రాబాద్‌లో కేసు ఎలా పెడ‌తారు..” అని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ట్వీట్లు చేస్తున్నారు క‌దా.. అస‌లు మీకు డేటా అంటే తెలుసా..? స‌రే.. తెలియ‌దనుకుందాం.. ఓకే.. కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాం చెప్పండి..

సేవామిత్ర యాప్ ఎవ‌రిది ? అందులో ఉన్న డేటా ఎవ‌రిది ? అలాంటి విలువైన డేటా ప్రైవేటు వ్య‌క్తుల వ‌ద్ద ఉండ‌వ‌చ్చా ? ఐటీ గ్రిడ్‌, బ్లూ ఫ్రాగ్ కంపెనీల‌కు మీ ఏపీ ప్ర‌భుత్వం ఎంవోయూ చేసుకున్నట్టు తెలియదా ? ఆ కంపెనీలు ఆఫీసులు ఎక్క‌డ ఉన్నాయి ? అమ‌రావ‌తిలోనా, హైద‌రాబాద్ లోనా ? ఆ కంపెనీలు ప‌నిచేస్తున్న‌ది సేవా మిత్ర యాప్‌కు అని తెలియ‌దా ? ఏపీ ప్ర‌జ‌ల డేటాను ఆ కంపెనీలు సేవామిత్ర యాప్‌కు అనుసంధానం చేశాయ‌ని తెలియ‌దా ? ఏపీలో ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌ర్వేలు చేయించి వైసీపీకి అనుకూలంగా వారి ఓట్ల‌ను తొల‌గించింది ఎవ‌రు ? మీకు అస‌లు మ‌తి ఉండే ట్వీట్లు పెడుతున్నారా ? జ‌రుగుతున్న ప‌రిణామాలు మీకు తెలియ‌వా ? మీకు ద‌మ్ము, ధైర్యం ఉంటే.. మేమ‌డిగిన ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పండి. అలా కాకుండా ఎప్ప‌టిలాగే తెరాస స‌ర్కారుపై, తెలంగాణ పోలీసుల‌పై, మీ రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై అన‌వ‌స‌రంగా నింద‌లు వేయ‌కండి. అస‌లు ఇన్ని సంవ‌త్స‌రాలు మిమ్మ‌ల్ని ఐటీ శాఖ మంత్రిగా భ‌రించారంటేనే.. ప్ర‌జ‌ల‌కు దండం పెట్టొచ్చు..

ఏపీ ప్ర‌జ‌ల డేటా చోరీ విష‌యంలో తెలంగాణ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుంటే అస‌లు మీకు ఎందుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి ? మీ త‌ప్పు లేక‌పోతే భ‌య‌ప‌డ‌డం దేనికి ? తెలంగాణ పోలీసుల ద‌ర్యాప్తుపై మీరు స‌మావేశాలు పెట్ట‌డం ఎందుకు ? మీ నాన్న గారు, ఏపీ సీఎం బాబు గారు డేటా చోరీపై సిట్ ఏర్పాటు చేశార‌ట‌. అస‌లు ఏమైనా.. మ‌తి ఉండే మీరు ఈ చ‌ర్య‌లకు పూనుకుంటున్నారా, చ‌ట్ట‌బ‌ద్దం కాని దర్యాప్తు విలువ ఉంటుందా ? అస‌లు ఆ కేసు నిల‌బ‌డుతుందా ? అధికారం చేతిలో ఉంద‌ని ఏమైనా చేస్తారా ? అడ్డగోలుగా ప్రేలాప‌న‌లు చేస్తే ప్ర‌జ‌ల‌కు జరిగిన సంఘ‌ట‌న‌లు, నిజాలు తెలియకుండా ఉంటాయా ? క‌చ్చితంగా తెలుస్తాయి. మీ కుట్ర‌లు, డ్రామాల‌కు తెర‌ప‌డే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. తొంద‌ర‌ప‌డ‌కండి. ముందు ఉంది ముస‌ళ్ల పండ‌గ‌. అప్ప‌టి వ‌ర‌కు కొద్దిగా వేచి ఉండండి..!

– డేటా చోరీ విష‌య‌మై గ‌గ్గోలు పెడుతూ, రాద్ధాంతం చేస్తున్న ఏపీ సీఎం బాబు, లోకేశ్‌ అండ్ కో బృందానికి క‌డుపు మండిన ఓ ఇంట‌ర్నెట్ పాఠ‌కుడి లేఖ‌..

Read more RELATED
Recommended to you

Exit mobile version