త్వరలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నారా?

-

తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఏపీలో కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే.. చాలా రోజుల నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు.

తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన ఘటన సీఎం కేసీఆర్ ది. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ చేయలేని పని సీఎం కేసీఆర్ చేశారు. చేసి చూపించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కోసం సీఎం కేసీఆర్ జిల్లాలను పెంచారు.

new districts in andhra pradesh?

తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఏపీలో కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే.. చాలా రోజుల నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదు.

అయితే.. 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీలో జిల్లాల విభజనపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. దీంతో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో చంద్రబాబు కూడా జిల్లాలను విభజిస్తే ఆ క్రెడిట్ మనమే కొట్టొచ్చని ఆయన కూడా మళ్లీ అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.

అయితే.. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ఎవరు గెలుస్తారో తెలియదు. ఇంకా 22 రోజుల సమయం ఉంది ఎన్నికల ఫలితాలు వెలువడడానికి. కానీ.. ఎవరు గెలుస్తారో ఇంకా తెలియకముందే… జిల్లాల విభజనపై ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా ఊహించుకుంటున్నారు. ఇదిగో దీన్ని జిల్లా చేస్తారు.. దాన్ని జిల్లా చేస్తారు… అని తమకు తాము ఊహించుకుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఏపీలో ముందు జరగాల్సింది జిల్లాల విభజనేనని అంటున్నారు. ఇప్పటికే ఓ పార్టీ.. తాము గెలిచేస్తామన్న నమ్మకంతో ఇదిగో ఈ పట్టణాలను జిల్లాగా మారుద్దాం అని అనుకుంటున్నారట. అంతే కాదు.. ఏపీలో ఏ పట్టణాలను జిల్లాగా మారిస్తే బాగుంటుంది. పరిపాలన సౌలభ్యం కోసం వేటిని జిల్లాలుగా చేయాలని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఏపీని జల్లెడ పడుతున్నారట.

వాళ్లు సర్వే చేస్తున్నారట. ఎన్ని జిల్లాలుగా ఏపీని విభజించాలి. ఎన్ని జిల్లాలు ఉంటే ఏపీ అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది.. అనే ఆలోచనలో ఉన్నారట. తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసినప్పుడు.. ఏపీలోని 13 జిల్లాలను 30 జిల్లాలుగా మార్చినా ఏం కాదు అన్న నమ్మకంతో ఉన్నారట. అంటే అటూ ఇటూగా 30 జిల్లాల వరకు ఏపీని విభజించే చాన్స్ ఉందన్నమాట.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. అసలు ఇది అయ్యే పనేనా…

ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి… ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఈ జిల్లాల విభజన ప్రక్రియ అటకెక్కాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది ఎందుకో మీకు కూడా ఇప్పటికే అర్థమయి ఉంటుంది. కానీ.. ఒకవేళ ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే… కేంద్రంలో బీజేపీ వస్తే.. అప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలా కాకుండా… ఏపీలో వైసీపీ, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా అంతే సంగతులట. లేదంటే ఏపీలో టీడీపీ, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. అప్పుడు ఏమన్నా జిల్లాల విభజన పట్టాలకెక్కొచ్చు.. అని భావిస్తున్నారు. ఏది ఏమైనా… ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైనే జిల్లాల విభజన ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news