ఏపీకి ఇచ్చింది సాయం కాదు అప్పు.. బాంబ్ పేల్చిన నిర్మ‌ల‌మ్మ‌

-

తెలుగింటి కోడ‌లు,కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడే విధంగా బడ్జెట్‌ రూపొందించామని ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని బ‌డ్జెట్‌లో ఆమె వెల్ల‌డించారు.ఈ బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు అధిక స్థాయిలో కేటాయింపులు దక్కాయి. అయితే ఇక్క‌డే ఆమె బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఏపీకి ఇచ్చేది సాయం కాద‌ని చెప్తూ అప్పు కింది ప‌రిగ‌ణిస్తున్నామ‌ని బాంబ్ పేల్చారు. ఇదేం ట్విస్ట్ అని ఏపీ ప్ర‌జ‌లు నిర్మ‌ల‌మ్మ‌పై ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు.

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ రాజధాని అభివృద్దికి ప్రత్యేకంగా రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ క్రెడిట్ అంతా ఇరు పార్టీల కృషేన‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు.తమ వల్లే ఈ కేటాయింపులని టీడీపీ నేతలు అంటుంటే, పవన్ వల్లే ఇంతటి స్థాయిలో నిధులు వచ్చాయంటూ జనసేన నేతలు చంకలు గుద్దుకుంటున్నారు.బ‌డ్జెట్ సెష‌న్ అనంత‌రం మీడియాతో మాట్ల‌డిన నిర్మ‌ల‌మ్మ‌…ఏపీకి తాము ఇచ్చేది సాయం కాదంటూ మాట మార్చేశారు.కేవ‌లం అప్పుగా మాత్రమే ఇస్తున్నామని తేల్చిచెప్పేశారు.ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామన్న‌ది ఆమె ఉద్దేశ్యం.

బ్యాంకులు ఎప్పుడూ అప్పులే ఇస్తాయి. ప్రపంచ బ్యాంక్ కూడా అంతే.ఏదీ ఉచితంగా ఇవ్వదు.మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే రూ. 15000 వేల కోట్ల రూపాయలు అనేది రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధమ‌వుతోంది.రాష్ట్ర ప్రభుత్వానికి , వరల్డ్ బ్యాంక్‌కు మధ్య కేంద్ర ప్రభుత్వం కేవ‌లం మధ్యవర్తిగా మాత్ర‌మే వ్యవహరిస్తోంది.అంటే కేంద్రం ఇస్తామ‌న్న‌ రూ. 15000 వేల కోట్ల సాయానికి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేది నిర్మ‌ల‌మ్మ మాట‌ల ద్వారా తేలిపోయింది. కాబట్టి ఈ రూ.15000 వేల కోట్లు ఏపీ ప్రభుత్వమే తిరిగి చెల్లించాలి.దీనిపై అటు సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. నిధులు అప్పుల రూపంలోనే అయినా వాటిని తీర్చేది 30 ఏళ్ల తర్వాతే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మ‌రి కూట‌మిలో భాగ‌మైన ఏపీ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకంగా కేంద్రం ఇచ్చేది ఏంటి అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.దీనికే కూట‌మి పార్టీలు చంక‌లు గుద్దుకోవాలా అని విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news