మద్యం సేవించమని ఎవరినీ బలవంతం చేయడం లేదు కాబట్టి మద్యంపై నిషేధం ఉండకూడదని మధ్యప్రదేశ్ మంత్రి గోపాల్ సింగ్ శుక్రవారం అభిప్రాయపడ్డారు. మద్యం తాగమని ఎవరిపైనా బలవంతం చేయడం లేదని, దానిని కొనుగోలు చేసేవారు స్వచ్ఛందంగా చేస్తున్నారని ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యంలో, మనిషి స్వేచ్ఛగా ఉంటాడు మరియు తనకు నచ్చినది తినడానికి మరియు త్రాగడానికి హక్కు ఉంది.
“మేము మద్యపానానికి ఎటువంటి నిషేధం విధించలేమని ఆయన స్పష్టం చేసారు. గోపాల్ సింగ్ తన స్నేహితుడిని ఉటంకిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. “మే౦ ఒక పెగ్ తీసుకునే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. మనం కొంచెం తాగకపోతే, రాత్రి సమయంలో ఇబ్బంది పడతాం, అంతే కాకుండా మాకు రోజంతా సమస్యలు ఎదురవుతాయని అన్నారు. నేను నా స్నేహితులు, రాత్రికి ఒక పెగ్ మాత్రమే తాగుతాం,
బాగా నిద్రపోతా౦ మరియు రోజంతా చురుకుగా ఉంటామన్నారు. “కొంతమందికి వారి అనారోగ్యానికి మద్యం కూడా అవసరం. ఆరోగ్యంగా ఉండటానికి డాక్టర్ సలహా మేరకు వారు ఒక పెగ్ మద్యం తీసుకుంటారని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. తినడం లేదా త్రాగే అలవాట్లపై నిషేధాలు విధించడానికి మేము సిద్దంగా లేమని గోపాల్ సింగ్ స్పష్టం చేసారు. కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం కాంట్రాక్టర్లకు దుకాణాలను తెరవడానికి అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.