మంత్రుల మధ్య కోఆర్డినేషన్ మిస్.. వరద బాధితులకు తప్పని బాధలు.. సీఎం పైర్..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అచ్యుతాపురం ఘటన జరిగింది..అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.. మంత్రులు, అధికారులు శ్రమించినా.. ప్రాణనష్టాన్ని నివారించలేకపోయారు.. ఆ ఘటన మరువకముందే మరో విపత్తు బెజవాడను ముంచెత్తింది.. లక్షల మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసినా.. మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది..

ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు.. మరో ఇరవై నాలుగు మంది మంత్రులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇందులో ముగ్గురు జనసేనకు చెందిన వారు అయితే ఒకరు బీజేపీకి చెందిన వారు. వీరంతా కుదురుకోకముందే విపత్తులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ప్రాణాలు తీస్తున్నాయి.. మంత్రులందరూ కలిసి ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో వారు చేతులెత్తేశారనే ప్రచారం ఊపందుకుంది.. మంత్రుల మధ్య సరైన కో ఆర్డినేషన్ లేదని వారి పనితీరు ఇంకా మెరుగుపడాలని వార్తలు వస్తున్నాయి. తమకు వరద సాయం అందలేదని సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతోనే బాధితులు చెప్పారంటే మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు..

వరద బాధితులకు ఆహారం అందించే విషయంలో ఏ మంత్రిత్వ శాఖ పనిచెయ్యాలనే దానిపై మంత్రులకు క్లారిటీ లేదట.. గత ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రారంభించిన రేషన్ సరుకుల వాహనాలను ఇప్పటి ప్రభుత్వం ఉపయోగించింది.. ఆ వాహనాల ద్వారానే నిత్యవసర సరుకులను బాధితులకు అందించింది. అయితే వాటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. దీనిపై సీఎం చంద్రబాబుకు పిర్యాదులు రావడంతో ఆయన నేరుగా రంగంలోకి దిగారు.. ఆయన ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.. మునిసిపల్ శాఖామంత్రి నారాయణకు, పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ కు వరద సాయం విషయంలో సమన్వయం లేదని.. అందుకే బాధితులకు సాయం అందలేదని సీఎం గ్రహించారట..

మంత్రి మనోహర్ నారాయణపై పిర్యాదు కూడా చేశారట.. మునిసిపల్ శాఖ నుంచి వాహనాలుఇస్తామని చెప్పి ఇవ్వలేదని.. అందువల్లే సరైన సమయంలో ప్రజలకు నిత్యవసరాలు అందించలేకపోయామని అన్నారట.. దీనిపై చంద్రబాబు నాయుడు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.. భారీ విపత్తు సంభవించినప్పుడు అందరూ కలిసి పనిచెయ్యాల్సిందిపోయి.. సమన్వయం లేకపోతే ఎలా అని ఆయన పైర్ అయ్యారట.. మంత్రుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం అన్నారట.. సోషల్ మీడియాలో సైతం వీరి సంభాషణ వైరల్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news