భారీ వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి.. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ ఇంకా వరదల నుంచి కోలుకోనే లేదు.. తెలంగాణలోని పలు జిల్లాలు విలవిలలాడుతున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.. మేము సైతం అంటూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.. ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ భరోసానివ్వాలనే ఉద్దేశంతో.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కోట్ల రూపాయల విరాళాలను ప్రకటిస్తున్నారు.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, మహేష్, ప్రభాస్ వంటి అగ్ర హీరోలు భారీగా విరాళాలు ప్రకటించి సొంత రాష్ట్రాలపై వారికున్న ప్రేమను చాటి చెప్పారు..
తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో ఎక్కడ విపత్తులు వచ్చినా తెలుగు హీరోలు వెంటనే స్పందిస్తారు.. భారీగానే విరాళాలు ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకుంటారు.. తెలంగాణ, ఏపీలో వరదల సమయంలో వారు చూపిన దాతృత్వంపై ప్రశంసల వెల్లువ వస్తోంది.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు సైతం తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు.. అయితే ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మొన్నటికిమొన్న కేరళలో వచ్చిన వరదలకు వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. వయణాడ్ రూపు రేఖలు కోల్పోయింది.. ఈ సమయంలో తెలుగు హీరోలు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.. కోట్ల రూపాయలు విరాళాలుగా ప్రకటించారు.. వారితోపాటు విక్రమ్ సూర్య వంటి ప్రముఖులు కేరళ ప్రభుత్వానికి చెక్కులు పంపారు..
కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలలో విపత్తుల సంభవిస్తే తెలుగు హీరోలు వెంటనే స్పందించారు..కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు విపత్తులు సంభవించినా.. పక్క రాష్టాల్లో హీరోలుగా ఉన్న ఒక్కరు కూడా స్పందించకపోవడం దారుణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.. సూర్య, కార్తీక్, విక్రమ్, రజనీకాంత్, విజయ సేతుపతి, విజయ్ దళపతి, కమలహాసన్ వంటి అగ్ర నేతలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది.. వారు నటించిన సినిమాలకు ఇక్కడే ఆదరణ ఎక్కువ.. అలాంటి తెలుగు ప్రజలపై.. పొరుగు హీరోలు నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని వారి అభిమానుల సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.. భారీ వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలు కకావికలమైతే.. ఒక్కరు కూడా పట్టించుకోలేదని, కనీసం… ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదంటూ మండిపడుతున్నారు. తెలుగు హీరోలను చూసి మిగిలిన హీరోలు తెలివి తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.. దీనిపై అక్కడి హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి..