సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆన్‌లైన్ పేకాటపై నిషేధం?

-

చదువుకునే యువత, నిరుద్యోగ యువత ఆన్‌లైన్ రమ్మీకి బాగా అలవాటు పడటం, ఆన్‌లైన్ పేకాట నిర్వాహకులు కూడా యువతకు డబ్బు ఆశ చూపిస్తూ ముగ్గులోకి లాగడం.. తద్వారా యువత డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు.

ఏపీలో జగన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో.. అప్పుడే ఏపీ స్వరూపమే మారిపోయింది. ఏ ముఖ్యమంత్రీ చేయని పనులను జగన్ చేస్తున్నారు. ఆయన ఆలోచనా ధోరణే సరికొత్తగా ఉంది. ఇప్పటికే బెల్డ్ షాపులపై ఉక్కుపాదం మోపిన ఏపీ ప్రభుత్వం, అంచెల వారీగా మద్యపానం నిషేధం చేయాలని భావిస్తోంది. అలాగే.. ఆన్‌లైన్ పేకాటపై కూడా నిషేధం విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ రమ్మీ పేరుతో చాలామంది దానికి బానిసలవుతున్నారని.. ముఖ్యంగా యువత.. తమ కెరీర్‌ను చక్కదిద్దుకోవాల్సిన సమయంలో రమ్మీ ఆట పేరుతో తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని గ్రహించిన ఏపీ ప్రభుత్వం.. దానిపై కూడా ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.

కలెక్టర్ల, ఎస్పీల సదస్సులోనే మంత్రి అవంతి శ్రీనివాస్.. ఆన్‌లైన్ పేకాట నిషేధాన్ని ప్రతిపాదించగా… సీఎం కూడా దానిపై సానుకూలంగా స్పందించారు.

చదువుకునే యువత, నిరుద్యోగ యువత ఆన్‌లైన్ రమ్మీకి బాగా అలవాటు పడటం, ఆన్‌లైన్ పేకాట నిర్వాహకులు కూడా యువతకు డబ్బు ఆశ చూపిస్తూ ముగ్గులోకి లాగడం.. తద్వారా యువత డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. చదువుపై కూడా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. దీంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు జులాయిలా తిరుగుతున్నారు. దీన్ని నివారించి.. యువతను సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి.. అని మంత్రి అవంతి సదస్సులో వెల్లడించారు.

వెంటనే సీఎం జగన్.. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ వివరణ కోరగా.. ఆన్‌లైన్ రమ్మీని నిరోధించడం సాధ్యం కాదని.. దాన్ని నిషేధించేటువంటి చట్టాలేవీ దేశంలో లేవని అన్నారు.

దీంతో వెంటనే సీఎం జగన్ స్పందిస్తూ.. ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ శాసనసభ సమావేశాల్లో ఏపీలో ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తున్నట్టు చట్టాన్ని తీసుకువద్దామని సూచించారు. దీంతో వచ్చే శాసనసభ సమావేశాల్లో ఏపీలో ఆన్‌లైన్ రమ్మీని నిషేధించేలా ఏపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకురానుంది. ఆ చట్టం వచ్చిన తర్వాత ఏపీలో ఆన్‌లైన్ రమ్మీ ఆడటానికి వీలుండదు.

Read more RELATED
Recommended to you

Latest news