మోదీపై ఎంపీలు రాజీనామా అస్త్రం ప్రయోగించనున్నారా?

-

పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనుండటంతో చివరి రోజున బలమైన అస్త్రాన్ని ప్రయోగించి ప్రధాని మోదీకి కునుకులేకుండా చేయాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. మోదీకి వ్యతిరేకంగా రాజీనామాలు చేసే యోచనలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా దీనిపై చర్చించినట్టు సమాచారం. ఇదిరకు భోఫోర్స్ కుంభకోణం సమయంలో చేసినట్టుగానే.. ఇప్పుడు రాఫెల్ కుంభకోణంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు.

రాఫెల్ తో పాటు ఏపీ ప్రత్యేక హోదా అంశం, సంయుక్త పార్లమెంటరీ కమిటీ లాంటి వాటిని హైలెట్ చేసి మూకుమ్మడి రాజీనామాలు చేయాలని… లోక్ సభ చివరి రోజున… మోదీ సర్కారుపై ఈ అస్త్రాన్ని ప్రయోగించి మోదీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version