ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్ బాగా తినేవారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!

-

చిప్స్, పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, ఐస్‌క్రీములు, ఇత‌ర బేక‌రీ ప‌దార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువ‌గా లాగించేస్తున్నారా ? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే ఇక‌పై మీరు ఆ ప‌దార్థాల‌ను తినాలంటేనే జంకుతారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకంటే.. ఆ ప‌దార్థాల‌ను తినడం వ‌ల్ల త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సాక్షాత్తూ సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైన నిజం.

కొంద‌రు సైంటిస్టులు జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను తిన‌డం వ‌ల్ల క‌లుగుతున్న అనర్థాలతోపాటు ఆ ఫుడ్‌ను తిన‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు ఎలాంటి రోగాల బారిన ప‌డుతున్నారు, ఏ వ‌య‌స్సులో చ‌నిపోతున్నారు.. అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు 2 ఏళ్ల పాటు అమెరికా, యూరప్‌ల‌లోని 44,551 మందిని ప‌ర్య‌వేక్షించారు. నిత్యం వారు తీసుకునే ఆహారం, ఇత‌ర అల‌వాట్లు, నిద్ర‌పోయే స‌మ‌యం, వారికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు త‌దిత‌ర వివ‌రాల‌ను రికార్డు చేశారు. ఈ క్ర‌మంలో సైంటిస్టుల‌కు తెలిసిందేమిటంటే… జంక్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తినే వారు త్వ‌ర‌గా చనిపోతార‌ని తేల్చారు. ఆ ఫుడ్ తిన‌ని వారితో పోలిస్తే తినే వారు త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు 14 శాతం వ‌ర‌కు ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిర్దారించారు.

కాగా సైంటిస్టులు చేప‌ట్టిన పై అధ్య‌య‌నాన్ని జామా ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌కు ఎంచుకున్న వారిలో పెద్ద‌లే అధికంగా ఉన్నారు. ఇక అమెరికాలో ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్‌ను తింటున్న వారి శాతం 61 ఉండ‌గా, కెన‌డాలో అది 62 శాతంగా ఉంది. అలాగే యూకేలో 63 శాతం మంది త‌మ డైట్‌లో ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. అయితే ఇలా ప్రాసెస్డ్‌, జంక్ ఫుడ్‌ను అధికంగా తింటే.. క్యాన్స‌ర్ లేదా గుండె జ‌బ్బుల బారిన ప‌డి త్వ‌ర‌గా చ‌నిపోతార‌ని, క‌నుక డైట్ విష‌యంలో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేన‌ని, వీలైనంత వ‌ర‌కు ఇంట్లో వండుకున్న ఆహారాన్ని తిన‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version