లేఖాస్త్రాల‌తో రెడీ అయిన ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి.. టార్గెట్ హుజూరాబాద్‌!

-

ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఎంత ఫేమ‌స్ అవుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో జ‌రిగిన దుబ్బాక ఎన్నిక‌ల‌కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. ఎంత‌లా క‌నీసం నోటిఫికేష‌న్ కూడా ఇవ్వ‌క‌ముందు అన్ని పార్టీలూ క‌లిసి జోరుమీద ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఇక ఇందులో అంద‌రికంటే ముఖ్యంగా ఈట‌ల రాజేంద‌ర్ చుట్టే చ‌ర్చ సాగుతోంది. కాగా ఆయ‌న్ను ఎలాగైనా ఓడించేందుకు టీఆర్ ఎస్ అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ఈట‌ల రాజేంద‌ర్ మీద‌కు ఆయ‌న న‌మ్మిన వారినే కేసీఆర్ వైరంలోకి దించుతూ రాజ‌కీయాలు న‌డిపిస్తున్నారు. ఇది వ‌ర‌కే హ‌రీశ్‌రావును ఇన్‌చార్జిగా నియ‌మించిన కేసీఆర్ తాజాగా ఆయ‌న టీమ్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)ని దించుతున్నారు.

ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy)

హుజూరాబాద్‌లో మొద‌టి నుంచి టీఆర్ఎస్‌కు అండ‌గా ఉంటున్న రైతు కుటుంబాల‌ను ఆక‌ర్షించేందుకు కేసీఆర్ రైతుల కోసం ఏమేం చేస్తున్నారో వివ‌రిస్తూ వారికి లేఖ‌లు రాస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలైన రైతుబంధుతో పాటు రైతు బీమా అలాగే కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్‌ల‌ను వివ‌రిస్తూ హుజూరాబాద్‌లోని ఐదు మండ‌లాల రైతుల‌కు లేఖ‌లు రాస్తున్నారు. మ‌రి చూడాలి టీఆర్ ఎస్ ప్లాన్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version