చంద్రబాబు ఆదేశాల‌తోనే ప‌వ‌న్ దీక్ష : ప‌వ‌న్ కు కౌంట‌ర్ వేసిన అంబ‌టి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ఆదేశాల తో నే జన సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు దీక్ష చేశాడ‌ని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. త‌మ పార్టీ అధికారం లో ఉంద‌ని.. టీడీపీ ఓట‌మి పాలు అవుతుంద‌ని బాధ తో నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతున్నార‌ని అన్నారు. త‌మ పార్టీ విశాఖ ఉక్కు పై చిత్త శుద్ధి తో పోరాటం చేస్తుంద‌ని అన్నారు. పార్ల‌మెంటు లో విశాఖ ఉక్కు గురించి పోరాటం చేశామ‌ని అన్నారు. అలాగే ఢిల్లీ లో కూడా త‌మ పార్టీ ఎంపీలు, నాయ‌కులు ఆందోళ‌న చేశామ‌ని అన్నారు.

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం టీడీపీ గానీ, జ‌న సేన పార్టీలు ఎం చేశాయని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు రిజ‌క్ట్ చేసిన వ్య‌క్తి ఇప్పుడు 151 సీట్లు గెలుచుకున్న జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయడం హాస్య‌స్ప‌దం అని అన్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక సారి చెగువీరా సిద్ధాంతం అని భ‌గ‌త్ సింగ్ అని మ‌రో సారి మ‌రో ఒక్క‌రు అని చెబుతున్నాడ‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల‌లో క్లారిటీ లేద‌ని విమ‌ర్శించారు.