కొత్తగా ఐదు కేసులు.. 38కి చేరిన బాధితులు

దేశంలో తాజాగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 38కి చేరుకున్నది. కేరళ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో మొదటిసారి ఒమిక్రాన్ వేరింయట్ కేసులు వెలుగు చూశాయి. కర్ణాటక, మహారాష్ట్రాలలో ఒక్కో కేసు నమోదు కాగా, ఆయా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 18కు చేరుకున్నది.

కేంద్ర ఆరోగ్య మంత్రి డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కు చేరుకున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య 92,281కి పడిపోయి 560 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఆదివారం కరోనా కారణంగా 306 మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 4,75,34కు చేరుకున్నది.