బాబు-పవన్ కొత్త ఎత్తు.. వైసీపీకి విరుగుడు?

-

మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..కానీ ఈ మధ్య చంద్రబాబు-పవన్ మాటలు చూస్తుంటే రెండు పార్టీల పొత్తు ఉండదనే విధంగా రాజకీయం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిస్తేనే జగన్ కు చెక్ పెట్టగలరని ప్రచారం నడుస్తోంది. ఇక ఆ దిశగానే బాబు-పవన్ సైతం పొత్తుకు రెడీ అన్నట్లే రాజకీయం చేశారు. అటు పరోక్షంగా పొత్తుకు సై అన్నట్లే ఉన్నారు. పవన్ ఓ అడుగు ముందుకొచ్చి…వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పి పొత్తుకు మూడు ఆప్షన్స్ కూడా చెప్పారు. అటు బాబు సైతం ప్రతిపక్షాలు తమతో కలిసిరావాలని చెబుతూ…పరోక్షంగా జనసేన సపోర్ట్ కావాలన్నట్లు మాట్లాడారు.

మరి ఇద్దరు నేతలు ఇలా పొత్తుకు సై అన్నట్లు మాట్లాడి…సడన్ గా పొత్తు ఉండదన్నట్లు చెప్పుకొచ్చేశారు. ఇప్పటికే చంద్రబాబు…వార్ వన్ సైడ్ అయిపోయిందని, తాము సింగిల్ గా పోటీ చేసి గెలుస్తామన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇటు పవన్ సైతం…తమ పొత్తు ప్రజలతో అని, ఎవరితో పొత్తు ఉండదన్నట్లు చెప్పుకొచ్చారు. అంటే టీడీపీ-జనసేన పొత్తు ఉండదని పరోక్షంగా బాబు-పవన్ చెప్పేశారు. అయితే ఇలా చెప్పడం వెనుక ఓ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది.

అసలు టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి నష్టం జరగడం ఖాయం..కానీ ఎప్పుడైతే రెండు పార్టీల పొత్తు ఉంటుందని ప్రచారం మొదలైందో…అప్పటినుంచి వైసీపీ..టీడీపీ-జనసేన పార్టీలని కలిపి టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అందరూ కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారని సెంటిమెంట్ లేపడానికి చూశారు. అలాగే టీడీపీ పొత్తు లేకపోతే గెలవలేదని, అలాగే చంద్రబాబుని సీమ్ చేయడానికే పవన్ ఉన్నారని…పరోక్షంగా టీడీపీ-జనసేన శ్రేణులని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇలా చేయడం వాళ్ళ టీడీపీ-జనసేనల మధ్య గొడవలు జరుగుతాయని అనుకున్నారు. దీని వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు.

అందుకే బాబు-పవన్ అలెర్ట్ అయ్యి…పొత్తు లేదని చెప్పి వైసీపీని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికల ముందు పొత్తు గురించి మాట్లాడాలని చెప్పి…అప్పటివరకూ పొత్తు గురించి చర్చ లేకుండా చేయాలని ట్రై చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు టోటల్ గా పొత్తు గురించి డైవర్ట్ చేసి, ఎన్నికల సమయంలో పొత్తు తేల్చుకోవచ్చని అనుకున్నారు. అందుకే ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టడానికి పొత్తు లేదని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version