పవన్ కల్యాణ్ రెడీ అయిపోయారు…బలం పెరుగుతుందా?

-

2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్(pawan kalyan) నేతృత్వంలోని జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జగన్ వేవ్‌లో పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల చిత్తుగా ఓడిపోయారు. ఆ పార్టీ తరుపున ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నారు. ఇక ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే ఏపీలో జనసేన బలోపేతం కావడం లేదు. ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కల్యాణ్ సేఫ్‌గా రాజకీయం చేసేస్తున్నారు.

పవన్ కల్యాణ్/pawan kalyan

కానీ ఏపీ రాజకీయాల్లోకి వచ్చి పవన్ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదు. సినిమాల్లో బిజీగా ఉన్న పవన్…అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేసి మళ్ళీ హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. దీంతో ఏపీలో జనసేన పార్టీ పరిస్తితి మరీ దిగజారిపోతుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన ఒకటి, రెండు సీట్లకే పరిమితం కావాలని విశ్లేషకులు అంటున్నారు.

కాబట్టి పవన్ కల్యాణ్ త్వరగా ఎంట్రీ ఇచ్చి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసముందని అంటున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో జనసేన తరుపున బలమైన నాయకుడుని పెట్టి, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందని అంటున్నారు. అయితే త్వరలోనే పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని జనసైనికులు చెబుతున్నారు.

అయితే పవన్ ఎంట్రీ ఇచ్చి, కొన్నిరోజులు పోరాటం చేసి మళ్ళీ హైదరాబాద్‌కు వెళ్లిపోతే పార్టీకే ఇబ్బంది అని చెప్పొచ్చు. అలాంటి రాజకీయాలు చేస్తే పార్టీకి ఎలాంటి లాభం జరగదని అంటున్నారు. పవన్ వచ్చే ఎన్నికల వరకు పార్టీ తరుపున పోరాటం చేయాల్సిందే అని, అలాగే నేతలనీ, కార్యకర్తలని యాక్టివ్ చేయాలని చెబుతున్నారు. అప్పుడు పార్టీ బలోపేతం అవుతుందని లేదంటే అంతే సంగతులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version