ఏపీలో పవన్ కల్యాణ్ చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. అవ్వడానికి వైసీపీ-టీడీపీలే అతి పెద్ద పార్టీలుగా ఉన్నాయి..రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నాయి..అయినా సరే పవన్ సెంట్రిక్‌గానే రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో కీ రోల్ పవన్ పోషించనున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేయడం అనేది పవన్ చేతుల్లోనే ఉంది. వాస్తవానికి పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలం లేదు.
ఆ పార్టీకి 6-7 శాతం ఓటు బ్యాంక్ ఉంది..అలాగే పట్టుమని పది సీట్లు గెలుచుకునే బలం ఆ పార్టీకి లేదు. కానీ గెలుపోటములని తారుమారు చేసే బలం పవన్‌కు ఉంది..పవన్ గాని టీడీపీతో జతకడితే రిజల్ట్ తారుమారు అవ్వడం ఖాయం. దీని వల్ల వైసీపీకి ఎంత డేంజర్ అనేది..ఆ పార్టీ నేతలకు కూడా బాగా తెలుసు..అందుకే వైసీపీ నేతలు..పదే పదే పవన్‌ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలోని కాపు నేతలు..ఏ స్థాయిలో పవన్‌ని టార్గెట్‌గా పెట్టుకుని ముందుకెళుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా పవన్‌ని చంద్రబాబుతో కలవనివ్వకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ కాపు నేతలు పనిచేస్తున్నారు.
ఒకవేళ కలిసినా సరే కాపుల ఓట్లు టీడీపీ-జనసేనకు ఎక్కువ వెళ్లకుండా చేయడమే టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా..ఇప్పుడు వైసీపీ చెప్పే మాటలని ప్రజలు నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. పైగా పవన్‌ని పొత్తు పెట్టుకోకుండా ఆపడం కష్టమైన పని. వైసీపీపై కసితో ఉన్న పవన్..ఖచ్చితంగా చంద్రబాబుతో కలవడానికే రెడీగా ఉన్నారు.
అదే సమయంలో తనదైన శైలిలో న్యూటరల్ ఓటర్లని వైసీపీ వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో న్యూటరల్ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఈ సారి మాత్రం ఆ పరిస్తితి లేదు. వారు టీడీపీ-జనసేన కూటమి వైపు టర్న్ అయ్యేలా ఉన్నారు. అలాగే ప్రతి ఎన్నికలోనూ నోటాకు ఓటు వేసేవారు ఉన్నారు. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంది. ఇక వారి టార్గెట్‌గా పవన్ ముందుకెళుతున్నారు. ప్రజస్వామ్యంలో ఓటు వృధా చేయకూడదని చెప్పి..నోటాకు ఓటు వేసే వారికి క్లాస్ ఇస్తున్నారు. వారి ఓట్లు కూడా జనసేనకు టర్న్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పవన్..తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు.