తెలంగాణలో అర్థరాత్రి వరకు పోలింగ్… కమలవికాసమే అంటున్న విశ్లేషకులు

-

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే ఎక్కడా ఓటర్లు ఇబ్బందులకు గురికాకుండా ఓటువేశారు. ఓవైపు ఎండలు తీవ్రస్తాయిలో ఉన్నా ఓటర్లు మాత్రం బెదరలేదు. లక్షలాదిమంది క్యూ లైన్లలో బారులు తీరి ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో అర్థరాత్రి వరకు ఈ పోలింగ్ కొనసాగింది.అర్థరాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగిందంటే ఓటర్లలో చైతన్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.గతంతో పోలిస్తే ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.తెలంగాణలో డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ నేతలు ధీమా వ్యక్తపరుస్తున్నారు.

గతంతో పోలిస్తే ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగింది. ఆదిలాబాద్ 73 శాతం, భువనగిరి 76.47 శాతం, చేవెళ్ల 55.45 శాతం కాగా అత్యల్పంగా హైదరాబాద్ సెగ్మెంట్ పరిధిలో 46.08 శాతం నమోదైంది. కరీంనగర్ 72.33 శాతం, ఖమ్మం 75.19 శాతం, మహబూబాబాద్ 70.68 శాతం, మహబూబ్ నగర్ 71.54 శాతం, మల్కాజ్ గిరి 50.12 శాతం, మెదక్ 74.38 శాతం, నాగర్ కర్నూల్ 68.86 శాతం, నల్గొండ 73.78 శాతం, నిజామాబాద్ 71.50 శాతం, పెద్దపల్లి 67.88 శాతం, సికింద్రాబాద్ 48.11 శాతం, వరంగల్ 68.29 శాతం, జహీరాబాద్ 74.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో 50.34 శాతం పోలింగ్ నమోదు అయినట్లు వెల్లడించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 65 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

ఈ పోలింగ్ తో తెలంగాణలో బీజేపీ కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు బీజేపీకే మొగ్గు చూపారని, తాము ఆశించినట్లుగానే బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్ లో కమల వికాసం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచేది బిజెపినేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.ఓటమి టెన్షన్ రేవంత్ రెడ్డి ముఖంలో కనిపించిందని, బిజెపికి మెజారిటీ సీట్లు తథ్యం ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news