పొంగులేటి కన్ఫ్యూజన్..ఖమ్మం బరిలో గెలిచే ఛాన్స్ ఉందా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీని వీడటం ఖాయమైంది..ఇప్పటికే ఆయన పార్టీకి దూరమయ్యారు. అటు పార్టీ అధిష్టానం కూడా పొంగులేటిని లైట్ తీసుకుంది. ఇదే క్రమంలో ఇటీవల అనుచరులతో వరుసపెట్టి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని, అందుకే ఈ నిర్ణయం అంటూ పార్టీ మారడంపై పొంగులేటి కామెంట్స్‌ చేశారు. టిఆర్ఎస్‌లో తనతో పాటు తన అనుచరులకు పదవులు ఇప్పించుకోలేక పోయానని, 2018 గాని, 2019లో గాని టికెట్లు దక్కలేదని అన్నారు. అయితే పొంగులేటి బి‌ఆర్‌ఎస్ పార్టీని వీడటంలో క్లారిటీ వచ్చింది గాని..ఏ పార్టీలో చేరతారనే విషయంపై క్లారిటీ రాలేదు. ఆయన ఎక్కువ శాతం బి‌జే‌పిలోకి వెళ్తారని, తన అనుచరులని కూడా బి‌జే‌పిలోకి తీసుకెళ్లి సీట్లు ఇప్పించుకుంటారనే ప్రచారం ఉంది. అయితే బి‌జే‌పిలోకి వెళితే ఖమ్మంలో గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయి. అక్కడ బి‌జే‌పి బలం శూన్యం. ఎంత పొంగులేటి ఇమేజ్ ఉన్నా సరే..గెలుపు బాటపట్టడం కష్టం.

కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీలోకి వెళితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. బి‌జే‌పికి పెద్ద బలం లేదు..బలమైన క్యాడర్ లేదు. ఎంత సొంత ఇమేజ్ మీద బండి లాగడమైన కుదరదు. ఒకవేళ నిదానంగా ప్రజల్లో మార్పు వచ్చి బి‌జే‌పి వైపు చూస్తే అప్పుడు ఆ పార్టీలో గెలుపు అవకాశాలు ఉంటాయి. మరి పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనేది చూడాలి. త్వరలోనే ఏ పార్టీలోకి వెళ్ళేది క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version