కాంగ్రెస్‌లోకి జగన్ సన్నిహితుడు… రేవంత్ ఎఫెక్ట్?

-

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయని తెలుస్తోంది. ఒకవేళ హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ ఓడిపోతే బి‌జే‌పికి రాష్ట్రంలో ఎదగడానికి మంచి ఛాన్స్ వచ్చినట్లే…అలాగే టి‌ఆర్‌ఎస్ ఓటమి కాంగ్రెస్‌కు కూడా బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే హుజూరాబాద్ ఉపఎన్నికని కాంగ్రెస్ లైట్ తీసుకుంది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి….రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు గానీ, కాంగ్రెస్ గెలవాలని మాత్రం అనుకుంటున్నట్లు కనిపించడం లేదు.

రేవంత్ రెడ్డి | Revanth Redd

హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ ఓడితే రాష్ట్రంలో కాంగ్రెస్, బి‌జే‌పిలకు పుంజుకోవడానికి మంచి ఛాన్స్. ముఖ్యంగా బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్‌కు బాగా ప్లస్ అవుతుంది. ఇదే సమయంలో టి‌ఆర్‌ఎస్‌లో ఉన్న బలమైన నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఒక సీనియర్ నేత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత…. పరిస్తితి బట్టి టి‌ఆర్‌ఎస్‌ని వీడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

అలా టి‌ఆర్‌ఎస్‌కు దూరమవ్వడానికి సిద్ధమైన నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ప్రచారం జరుగుతుంది. పొంగులేటి….వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవ్వడంతో పొంగులేటి టి‌ఆర్‌ఎస్‌లోకి వచ్చారు.

కానీ 2019 ఎన్నికల్లో పొగులేటికి టిక్కెట్ దక్కలేదు. ఆయన ప్లేస్‌లో టి‌డి‌పి నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు కే‌సి‌ఆర్…ఖమ్మం ఎంపీ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా విజయం సాధించారు. అయితే పొంగులేటికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఏ పదవి ఇవ్వలేదు. పైగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి వర్గానికి టి‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత దక్కడం లేదట. ఈ విషయంపై టి‌ఆర్‌ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఉపయోగం లేదట. ఈ క్రమంలోనే పొంగులేటి టి‌ఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట….అలాగే పరిస్తితిని బట్టి కాంగ్రెస్‌లోకి జంప్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. అటు రేవంత్ కూడా…పొంగులేటిని కాంగ్రెస్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారట. మరి చూడాలి పొంగులేటి రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version