ఏపీ బీజేపీలో మరో చిచ్చు..జీవీఎల్‌పై పురందేశ్వరి ఫైర్..గుడ్‌బై!

-

ఏపీ బీజేపీలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ప్రత్యర్ధులపై విరుచుకుపడాల్సిన నేతలు. ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ నాయకుడు ఈ రచ్చ వల్లే బి‌జే‌పికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జి‌వి‌ఎల్ నరసింహారావు వైఖరి నచ్చక..గత కొన్ని రోజుల నుంచి కన్నా అసంతృప్తితో ఉన్నారు. అలాగే సోము, జి‌వి‌ఎల్‌పై విమర్శలు చేశారు. చివరికి కన్నా బి‌జే‌పిని రాజీనామా చేసి బయటకొచ్చారు.

ఈ వివాదం ఇంకా సద్దుమనగక ముందు బీజేపీలో మరో చిచ్చు రేగింది. ఎంపీ జీవీఎల్ పై అదే బి‌జే‌పికి చెందిన సీనియర్ నాయకురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఇటీవల జి‌వి‌ఎల్ కాపు నినాదం అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తాజాగా విజయవాడకు వచ్చిన ఆయన..రంగా విగ్రహానికి నివాళులు అర్పించి.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదొక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అయినా అన్నిటికీ ఆ ఇద్దరి పేర్లేనా అంటూ..ఎన్టీఆర్- వైఎస్సార్‌ పేర్లని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆ ఇద్దరి పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు రంగా పేరు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.

ఇక జీవీఎల్ కామెంట్‌కు పురందేశ్వరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు..ఆ మహానుభావులు అని చెబుతూ..జీవీఎల్ కామెంట్ చేసిన వీడియో పోస్టు చేసి దానికి కౌంటరుగా ..

“అన్నీ ఇద్దరి పేర్లేనా”

“ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరోకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు” అని జీవీఎల్‌కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

ఇలా పురందేశ్వరి సొంత పార్టీ నేతకే కౌంటర్ ఇవ్వడంతో..ఈమె కూడా కన్నా మాదిరిగానే బి‌జే‌పికీ గుడ్ బై చెబుతారా? అనే చర్చ నడుస్తోంది. చూడాలి మరి పురందేశ్వరి ఏం చేస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version