తమిళ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన చేసారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనని చెప్తూ మూడు పేజీల లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తన అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన సదరు లేఖలో స్పష్టం చేసారు. అలాగే అభిమానులకు తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసారు.
రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నా అని రజనీ పేర్కొన్నారు. ఇటీవల రజనీ కాంత్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజనీకి వైద్యులు సూచనలు చేసారు. వచ్చే ఏడాది జనవరి 17 న ఆయన రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని అందరూ భావించారు.
ఎమ్జీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రజనీ పార్టీ పెట్టే అవకాశముందని ప్రకటన వచ్చింది. 2021 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రజనీకాంత్ తన రాజకీయ పార్టీని జనవరిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రజనీకాంత్ ఈ ప్రణాళికలను రద్దు చేయడంతో తమిళ సినీ రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి.
— Rajinikanth (@rajinikanth) December 29, 2020