చంద్ర‌బాబువి అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు : రాజ్‌నాథ్‌సింగ్‌

-

గుంటూరు ఇన్న‌ర్‌రోడ్డు వ‌ద్ద బిజేపీ కార్యాల‌యానికి శంకుస్థాప‌న‌

గుంటూరు: రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కృషిచేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు.

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బిజేపీ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.బిజేపీకి ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకీ ఉండరన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2014లో బిజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంకల్పాలు తీసుకున్నామని, కూటమి మిత్ర ధర్మం పాటించేందుకు బిజేపీ పూర్తిస్థాయిలో కృషిచేసిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version