మెగాస్టార్ కు రాజ్యసభ సీటు.. క్లారిటీ ఇచ్చిన చిరు

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురువారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రితో స‌మావేశం అయిన విష‌యం తెలిసిందే. ఏపీలో నెల‌కొన్న సినిమా టికెట్ల విష‌యంపై సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి స‌మావేశం అయ్యారు. అయితే ఈ స‌మావేశం జ‌రిగ‌న నుంచి ఒక వార్త తెలుగు రాష్ట్రాల‌లో తెగ చెక్క‌ర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవికి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్య స‌భ సీటును ఏపీ సీఎం జ‌గ‌న్ ఆఫ‌ర్ చేశారనే వార్తలు నిన్న సాయంత్రం నుంచి తెగ వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవికి రాజ్య స‌భ సీటు ఇచ్చి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి.

అయితే ఈ పుకార్ల పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు రాజ్య సభ సీటు ఇస్తున్నార‌నే వార్త‌లలో ఎలాంటి నిజం లేద‌ని తెల్చి చెప్పారు. త‌న వ‌ద్ద‌కు ఇలాంటి ఆఫ‌ర్లు ఇక రావ‌ని స్ప‌ష్టం చేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాని ప్ర‌క‌టించారు. తాను ఎప్పుడు రాజకీయాల‌కు, ప‌ద‌వుల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపారు. అలాగే త‌ను ఎప్పుడు కూడా ప‌దువుల‌కు ఆశ ప‌డ‌లేద‌ని సీట్లు కోసం ఆరాట ప‌డ‌లేద‌ని అన్నారు. అలాంటివి కూడా ఎప్పుడు కోరుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే గ‌త రెండు రోజుల నుంచి వ‌స్తున్న పుకార్లుకు ఏకంగా చిరంజీవి చెక్ పెట్టారు.