ఆ విష‌యంలో ష‌ర్మిల‌తో పోటీ ప‌డుతున్న రేవంత్‌.. క‌లిసొస్తుందా

-

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది గుండెల్లో చిర‌స్థాయిగా నిలిపోయింది. వైఎస్ ఆర్ 2004లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు పెద్ద ఎత్తున‌ ప్ర‌జ‌లు ఆకర్షితుల‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణాన్ని జీర్జించుకోలేక చాలా మంది అభిమానులు గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌రి కొంద‌రు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఫోటోను ఇంట్లో పెట్టుకుని త‌మ కుటుంబ స‌భ్యునివ‌లె ఇప్ప‌టికీ పూజిస్తున్నారంటే ఆయ‌నంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న సుమారు 11 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయినా ఆ పేరులో ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రాజ‌న్న రాజ్యం అంటూ జ‌గ‌న్ ఆంధ్రాలో ఓట్ల తుఫాన్ సృష్టించాడు.

భారీ మెజారిటీతో వైఎస్సార్ సీపీ ఆంధ్రాలో అధికారం చేప‌ట్టింది. ఇప్పుడు ఆ పేరు కోస‌మే తెలంగాణాలో కొట్లాట మొద‌లైంది. రాజ‌న్న‌ రాజ్యం స్థాపిస్తానంటూ వైఎస్ ష‌ర్మిలా వైఎస్ ఆర్ టీపీ అనే పార్టీని స్థాపించారు. మ‌రో వైపు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అధ్య‌క్షుడ‌య్యాక ఆ పార్టీ లో కొత్త ఊపు వ‌చ్చింది. తెలంగాణ అంతా తిరుగుతున్న రేవంత్ కాంగ్రెస్ చేసిన ప‌నుల‌తో పాటు వై ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను తెలంగాణ ఓట‌ర్ల దృష్టికి తీసుకెళ్తున్నారు. గురువారం రాజ‌శేఖ‌ర్ రెడ్డి 12 వ వ‌ర్థంతిని హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రేవంత్ రెడ్డితో పాటు వైఎస్ ఆత్మ‌గా పిల‌వ‌బ‌డే కేవీపీ రామచంద‌ర్‌రావు కూడా హాజ‌రై నివాళుల‌ర‌ప్పించారు. అనంత‌రం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఈ దేశ ప్ర‌ధానిగా చూడాల‌న్న‌ది వైఎస్ చిర‌కాల కోరిక అని చెప్పారు.

ఆ క‌ల‌ల‌ను తామే నేరువేరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ హ‌యాంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో పాటు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌తుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మ‌రు క్ష‌ణం వైఎస్ ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను తిరిగి పున‌రుద్ద‌రిస్తామ‌ని తెలిపారు. అటు ష‌ర్మిలా ఇటు రేవంత్‌రెడ్డి ఇద్ద‌రు నాయ‌కులు వైఎస్ ఆర్ త‌మ వాడంటే త‌మ వాడ‌ని ఓన్ చేసుకొనే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులను త‌మ వైపు తిప్పుకొని అధికారంలో రావాల‌నే ఉవ్విళ్లురుతున్నారు. అయితే వైఎస్ విజ‌య‌మ్మ నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నానికి కాంగ్రెస్ నుంచి ఎవ‌రు వెళ్లనివ్వ‌పోవ‌డానికి కూడా కార‌ణం ఇదేన‌ని గుస‌గ‌స‌లు విన‌బ‌డుతున్నాయి. వీరికి కౌంట‌ర్ గా తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌ను ర‌గిలించి వీరి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాల‌ని కూడా ప‌లువురు భావిస్తున్నారు. వైఎస్ ఆర్ సెంటిమెంట్ ఏ మేర‌కు ప‌నిచేస్తుందో భ‌విష్య‌త్ నిర్ణ‌యించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version