కొడంగల్‌ బరిలోనే రేవంత్..లీడ్‌లోకి వచ్చారా?  

-

మొత్తానికి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను పోటీ చేయబోయే సీటుపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆయన ఏ సీటులో పోటీ చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ సారి ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయరని, ఉప్పల్ లేదా ఎల్బీ నగర్ లో పోటీ చేస్తారని..కాదు కాదు ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తారని ఎప్పుడు ఏదొక చర్చ నడిచింది. అటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రేవంత్ రెడ్డిని తమ తమ సీట్లలో పోటీ చేయాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి..వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కోరుతున్నారు అని, కానీ అధిష్టానం మాత్రం కొడంగల్ నుంచే పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని, ఇంకా కొడంగల్ బరిలోనే ఉంటానని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ గతంలో రెండుసార్లు కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే.

2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి అక్కడ గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు..2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.  గత ఎన్నికల్లో కే‌టి‌ఆర్, హరీష్ పక్కా వ్యూహాలతో రేవంత్‌ని ఓడించారు. బి‌ఆర్‌ఎస్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత పెరిగింది…ఇటు రేవంత్ బలం పెరిగింది.

ప్రస్తుతం కొడంగల్ లో రేవంత్ ఆధిక్యంలోకి వచ్చారు. ఆయన బలం పెరిగింది. ఇక్కడ బి‌జే‌పికి పెద్ద బలం లేదు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version