కేసీఆర్ వ్యూహానికి రేవంత్ విరుగుడు…వర్కౌట్ అవుతుందా?

-

ఏ రాజకీయ పార్టీ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాలే ఎక్కువ చేస్తుంది. సామాజికవర్గాలకు అనుగుణంగా వారిని ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వ్యూహాలు వేస్తూ ముందుకెళ్తాయి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సైతం అదేవిధంగా ముందుకెళుతుంది. తెలంగాణలో దళితుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వారిని ఆకట్టుకోవడమే పనిగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే మొదట హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా అక్కడ ఉండే దళితులని ఆకట్టుకోవడానికి దళితబంధు అనే స్కీమ్‌ని తీసుకొస్తున్నారు. ఇదే స్కీమ్ రాష్ట్రమంతా అమలు చేయాలని చూస్తున్నారు. దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది.

అయితే కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు పెద్దగా న్యాయం జరగలేదని ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నాయి. అలాగే కేసీఆర్ ప్రభుత్వం పట్ల దళితులు కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారని వాదన ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ వరుసపెట్టి, దళితులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాలకు టీపీసీసీ రేవంత్ రెడ్డి విరుగుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా దళితులు కాంగ్రెస్‌కు ఎక్కువగా మద్ధతుగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు దళితులని టీఆర్ఎస్ వైపుకు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. దానికి కౌంటర్‌గా ఇంద్రవెల్లిలో లక్ష మందితో దళిత దండోరా కార్యక్రమం నిర్వహించాలని, ఈ కార్యక్రమం ద్వారా దళితులు కాంగ్రెస్ వైపే ఉన్నారని నిరూపించాలని చూస్తున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ సక్సెస్ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version