ర‌విప్ర‌కాష్‌ను రేవంత్ ఎందుకు క‌లిశాడు….

-

తెలుగు జర్నలిజంలో సంచలనం సృష్టించి టీవీ 9ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇటీవల జరిగిన పరిణామాలతో చంచల్ గూడ జైలుకు వెళ్లారు. కొత్త యాజ‌మాన్యం ర‌విప్ర‌కాశ్‌ను బ‌య‌ట‌కు పంపే వర‌కు నిద్ర‌పోలేదు. ఆ త‌ర్వాత ఎన్నో సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ర‌విప్రకాశ్‌కు స‌న్నిహితంగా ఉంటున్నాడు అన్న కార‌ణం చేత జాఫ‌ర్‌ను సైతం యాజ‌మాన్యం బ‌య‌ట‌కు పంపేసిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే టీవీ9లో ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జాఫ‌ర్ బ‌య‌ట‌కు వెళ్లినా కూడా ఆయ‌న‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న త‌న‌ సన్నిహితులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలెవరూ ఆయన్ను పట్టించుకున్న దాఖలాలు లేవు.

రవిప్రకాశ్ ను కలిస్తే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కి  తెలుస్తుందనే భావనలో ఉండి ఎవరి పని వారు చూసుకుంటూ  ఆయన్ను ను పట్టించుకోవడం మానేశారు. ఇక ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉంటోన్న జాఫ‌ర్‌ను సైతం యాజ‌మాన్యం బ‌య‌ట‌కు పంపేయ‌డంతో ఇప్పుడు ఎవ‌రికి వారికి గుబులు ప‌ట్టుకుంది. దీంతో టీవీ9లో ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న వారు సైతం ఆయ‌న పేరు ఎత్త‌డం మానేశారు. ఇక రెండు రోజుల క్రితం ర‌విప్ర‌కాశ్‌ను కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

వారిద్ద‌రి మ‌ధ్య అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌న్నది ఇప్పుడు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇక వీరిద్ద‌రి టార్గెట్ కేసీఆర్‌, టీఆర్ఎస్. అందుకే రేవంత్ ధైర్యంగా ర‌విప్ర‌కాశ్‌ను క‌లిశాడ‌న్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ గురించిన వ్య‌వ‌హారం ర‌విప్ర‌కాశ్‌కు మొత్తం తెలుస‌ని… ర‌విప్ర‌కాశ్‌ను పోలీసులు బాగా టార్గెట్ చేసి విచారిస్తుండ‌డంతో త‌న పేరు బ‌య‌ట‌కు వ‌స్తే ఇబ్బందులు వ‌స్తాయ‌నే రేవంత్ ర‌విప్ర‌కాశ్‌ను క‌లిశాడ‌ని అంటున్నారు.

టీవీ 9 నిధుల విషయంలో కొత్త యాజమాన్యంతో గొడవ జరుగుతున్న నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ, ఈడీ విచారణ జరపాలని కోరుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రవి ప్రకాశ్, రేవంత్ రెడ్డి ఇష్యూ హాట్ టాఫిక్ గా మారింది. ఇక మ‌రో టాక్ ప్ర‌కారం ర‌విప్ర‌కాశ్ బీజేపీ స‌పోర్ట్‌తో ద‌క్షిణాది భాష‌ల్లో కొత్త మీడియాను స్టార్ట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version